ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జనసేన పార్టీ ఎమ్మెల్యే వినూత్నంగా వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మత్స్యకార వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు. సాంప్రదాయ మత్స్యకారునిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.. ఆయన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నేత. చేపల వలతో సాంప్రదాయ మత్స్యకారుడిగా నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ వచ్చారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీలో సాధారణ కార్యకర్తలా చేరారు.. ఆ తర్వాత నరసాపురం నియోజకవర్గం ఇంఛార్జ్ అయ్యారు. అయితే పొత్తులో భాగంగా సీటు వస్తుందో రాదని టెన్షన్ పడ్డారు.. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా జనసేన పార్టీవైపు చూడటం.. నరసాపురంలో కాపు సామాజిక వర్గానికి సీటు ఇస్తారనే ప్రచారంతో గందరగోళం ఏర్పడింది. కానీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం నాయకర్ వైపు మొగ్గుచూపారు.. టికెట్ కేటాయించారు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుపై 49వేలపై చిలుకు ఓట్లతో నాయకర్ విజయం సాధించారు.