ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్, మంత్రుల ప్రమాణ స్వీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 21, 2024, 08:39 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లు ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణం చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.. అక్కడ మెట్లకు మొక్కారు. అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్‌కు వెళ్లారు.


కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు సభలో అడుగుపెట్టగా.. ఆ సమయంలో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు.చంద్రబాబు 2021 నవంబర్ 19న సభలో శపథం చేశారు.. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వస్తానన్నారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చిన తర్వాతే అడుగుపెడతానన్నారు. ఆ రోజు 'ఇన్నేళ్లూ పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండను. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం' అంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం టీడీపీ కార్యాయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కన్నీటి పర్యంతం అయ్యారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఇవాళ మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టారు.. ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com