రాజధాని అమరావతి కోసం మహిళలు చాలా కష్టపడ్డారని ఉద్యమంలో మహిళలే కీలక పాత్ర పోషించారని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అన్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగిందని విమర్శించారు. అనంతరం ఆయనను మహిళలు ఘనంగా సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, అదితి గజపతి రాజు, బండారు శ్రావణి, పరిటాల సునీత, గౌరు చరిత, దేవిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మాధవిరెడ్డి, గౌతు శిరీష, కాల్వ శ్రీనివాస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక టేశ్వర్లు, మాజీ మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి, కృష్ణాజిల్లా మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొన్నారు.