మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం తృటిలో తప్పింది. కాన్యాయ్‌లోని రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తాడిగొట్ల వద్ద కాన్వాయ్‌లోని ఫైర్ వాహనాన్ని వెనక నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కడప ఎయిర్‌పోర్టు నుంచి జగన్ పులివెందులకు రోడ్డుమార్గాన వెళ్తుడంగా ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా సొంత నియోజకవర్గం పులివెందులలో మూడ్రోజుల పర్యటన నిమిత్తం మాజీ సీఎం వెళ్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.