అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో ఆదివారం పూర్వ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించారు. కళ్యాణదుర్గం డిగ్రీ కళాశాలలో 1994 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు 30 సంవత్సరాల అనంతరం కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గరుడాపురం సత్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు ఎద్దుల ఉదయ్ లు మాట్లాడుతూ తమ స్నేహితుల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.