సత్యసాయి జిల్లాలో ఉన్న 32 మండలాల్లో రైతులకు అవసరమైన వేరుశనగ విత్తన కాయలు కంది విత్తనాలను సరిపడినంత సరఫరా చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి రమణ డిమాండ్ చేశారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయానికి కావలసినంత వర్షపాతం నమోదయిందని కానీ ప్రభుత్వం రైతులకు కావలసినంత వేరుశనగ, కంది విత్తనాలను సరఫరా చేయలేదని వెంటనే రైతులతో అవసరమైన మేరకు సరఫరా చేయాలని డిమాండ్ చేశాడు.