రాయదుర్గం పట్టణంలో ఆదివారం మద్యాహ్నం 12 నుండి విద్యుత్ అనధికార కోతలతో అల్లాడుతున్న ప్రజలు. పట్టించుకోని విద్యుత్ అధికారులు. ఎందుకు కోత విధించారో ఎప్పుడు వస్తుందో తెలియక జనం అల్లాడిపోతున్నారు. అసలే ఆదివారం ఇంట్లో ఉండలేక బయట వెళ్లలేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ఎవరికీ పట్టించుకోవడం లేదు. కనీసం సమాధానం చెప్పే అధికారి కూడా లేకపోవడం విడ్డూరంగా ఉంది.