కళ్యాణదుర్గంకి చెందిన రాయలసీమ రామన్న టిడిపి వీరాభిమాని. ఈ ఎన్నికల్లో కూడా తనవంతుగా పార్టీకి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచిన సురేంద్రబాబుకి అభిమానిగా మారాడు. తన అభిమానాన్ని చాటుకోవడానికి ఏకంగా కళ్యాణదుర్గం నుంచి ఈ నెల 16న సైకిల్ పై బయలుదేరి ఆదివారం అమరావతికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేరుకోవాలని భావించాడు. అయితే సైకిల్ తొక్కుకుంటూ ఒకరోజు ఆలస్యంగా చేరుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa