అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. వైయస్ఆర్సీపీ నాయకుడు, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సజ్జలదిన్నె రాజు అనుచరుడు వేణుగోపాల్‌రెడ్డికి చెందిన నాపరాళ్ల ఫ్యాక్టరీలో బండలను ధ్వంసం చేశారు. దాదాపు 20 చదరాల బండలు ధ్వంసం అయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన టీడీపీ వారే ధ్వంసం చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన వైయస్ఆర్సీపీ కార్యకర్త రవీంద్రారెడ్డి తన రెండెకరాల పొలంలో నెల క్రితం సాగు చేసిన పత్తి పంటను టీడీపీ వర్గీయులు శనివారం దున్నేసి నాశనం చేశారు. అదే గ్రామానికి చెందిన ఆలూరు రామాంజులరెడ్డి, జూటూరు రామాంజులరెడ్డి ట్రాక్టర్‌తో తన పంటను దున్నేసినట్లు బాధితుడు వాపోయాడు. దాదాపు రూ.30 వేలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు.