మడకశిర నియోజకవర్గంలోని హంద్రీనీవా కాలువ పనులను త్వరలోనే చేపట్టి అన్ని చెరువులకు నీరందిస్తామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆయాన ఆదివారం అగళి మండలంలోని హంద్రీనీవా కాలువను పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం హంద్రినీవా కాలువ పనులపై శ్రద్ధ చూపలేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు.