ఏపీ రాజధాని అమరావతికి ఓ రూపు తెచ్చే దశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. రాజధాని పనుల పునర్ః నిర్మాణంతో పాటు కేంద్ర సంస్థలను రాజధానికి రప్పించేందుకు చర్యలు చేపడుతోంది. 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా సంస్థలకు కేటాయించిన భూముల విషయంలో వారి ఆలోచనలను, ప్రణాళికలను చెప్పాలంటూ సీఆర్డీఏ అధికారులు ఫోన్లు చేస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో తమను ఎవ్వరూ సంప్రదించ లేదని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. కొన్ని సంస్థలు అయితే తమకు కేటాయించిన స్థలం చూపెట్టాలంటున్నారు. నాటి తెలుగుదేశం హయాంలో 10-15 కేంద్ర సంస్థలకు.. జాతీయ బ్యాంకులకు రాజధానిలో భూములు కేటాయించారు. అప్పుడు టీడీపీ హయాంలో భూ కేటాయింపులు జరిపిన సంస్థల వివరాలు.... కాగ్, ఆర్బీఐ, సీబీఐ, ఎఫ్‌సీఐ, సీపీడబ్ల్యూడీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, నిఫ్ట్, ఎన్ఐడీ, టూల్ డిజైన్. నాబార్డ్ , ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎల్ఐసీ, ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, గెయిల్ తదితర సంస్థలకు భూములు కేటాయించారు.