ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో రైతులు కోరే విత్తనాలు, ఎరువులు అందిం చేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి చేనుకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస మండల పరిషత్ కార్యా లయంలో మండల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. రైతులకు ఇబ్బందులు కలుగ జేయ వద్దన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్లుగా వంశధార కాలువల్లో ఎటువంటి పనులు చేపట్టలేదని, దీంతో రైతులు సాగునీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రక్షిత తాగునీటి పథ కాలపై రోడ్లను తవ్వి పైపులు వేశారని, అవి ఎంతమేర పని చేస్తున్నాయో పరిశీలించాల్సి ఉందన్నారు. వివిధ శాఖల్లో జరిగిన పనులపై పూర్తి స్థాయి సమాచారం అందిస్తే ఎంత వరకు న్యాయం జరుగుతుందో పరిశీలిస్తామన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులే ప్రభుత్వం నిర్వహించే పనుల్లో జోక్యం చేసుకుని వారి విధుల ను నిర్వహించాలన్నారు. మండల సమావేశానికి రెవెన్యూ శాఖతో పాటు మరికొన్ని శాఖల అధి కారులు హాజరుకాలేదని, దీనిపై వారి వివరణ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సమావేశానికి ఎంపీపీ ప్రవీణ అధ్యక్షత వహించగా ఎంపీడీవో మెట్ట వైకుంఠరావు, వైస్ ఎంపీపీ టి.రాములు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు మండల ప్రజాప్రతినిధులు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గౌతు శిరీషను సత్కరించి అభినందించారు.