నియోజకవర్గ ప్రజలకు పాలకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటానని ప్రజలు ఊహించిన దాని కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. అసెంబ్లీలో ఎమ్మె ల్యేగా ప్రమాణం చేసి తొలిసారి కోరుకొండకు వచ్చిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం సా యంత్రం అపూర్వ స్వాగతం పలికారు. అమరావతి నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన ఆయనకు గాడాల వద్ద ఘన స్వాగతం లభించింది. అనంతరం కోరుకొండ, మీదుగా భారీ ప్రదర్శనగా గాదరాడకు చేరుకున్నారు. పలుచోట్ల ఆయ నను గజమాలతో సత్కరించారు. కోరుకొండ వెంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఆలయ చైర్మన్ పరాసర రంగరాజభట్టర్ ఆధ్వర్యంలో అర్చకస్వాములు, వేద పండితులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం బలరామకృష్ణ దంపతులు, కుటుంబీకులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆపై గాదరాడ చేరుకుని గాదరాడ ఓం శివశక్తి పీఠంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా నరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు నరసింహస్వామి ఆలయంలో సుదర్శన యాగం చేద్దామనుకుంటే ఆనాటి పాలకులు అడ్డుకున్నారని, స్వామివారి కల్యా ణోత్సవాల్లో కూడా పాల్గొనకుండా అధికారులను బెదిరించారన్నారు. నరసింహస్వామి అనుగ్రహంతో ఎమ్మల్యేగా అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారని, సేవకుడిగా పని చేస్తానని బత్తుల పేర్కొన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీరుకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. రోడ్లు, డ్రైన్లు, వీధిలైట్లు ఏర్పాటు చేస్తానన్నారు. రంగనాథస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు కృషి చేస్తానన్నారు. ముందుగా కోరుకొండ నరసింహస్వామికి పానకంతో అభిషేకంచేసి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కుచెల్లించుకున్నారు. కార్యక్రమాల్లో బత్తుల వెంకటలక్ష్మి, తోట ప్రత్యూషదేవి, బత్తుల వందనాంబిక, బత్తుల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.