కర్ణాటక రాష్ట్రంలోని ఓ కళాశాలలో మెడిసిన్ పీజీ విద్యార్థిని పివీ సృజని(27) అనారోగ్యంతో మృతి చెందింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మాజీ జడ్పీటీసీ పి.మాధురి, వెంకటరమణారెడ్డి కుమార్తె సృజని కర్ణాటక మంగుళూరు సమీప సుల్లియాలోని కాలేజిలో చదువుతోంది. నాలుగురోజుల కిందట జ్వరం వచ్చింది. అయితే రక్త పరీక్షలు చేయగా డెంగ్యూ సోకడంతో ప్లేట్‌లెట్స్ తగ్గిపోయాయి. కాలేజిలో సరైన వైద్యం అందకపోవడంతో ప్లేట్‌లెట్స్ బాగా తగ్గి పరిస్థితి విషమించింది. ఆ విషయాన్ని అర్దరాత్రి దాటిన తర్వాత కాలేజి యాజమాన్యం సృజని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాదు సనత్‌నగర్‌లో నివాసం ఉం టున్న వారు వెనువెంటనే బయలు దేరారు. అయితే సృజని ఆరోగ్యవిషయంలో కాలేజి వైద్యులు చేతులెత్తేసి మెరుగైన వైద్యం కోసం మంగుళూరుకు వెళ్లాలని చెప్పడంతో ఆమెను మంగుళూరుకు తరలిస్తుండగా మార్గమద్యలో కోమా స్థితికి చేరుకుంది. తల్లిదండ్రులు చేరుకుని కోమాలో కొన ఊపిరితో ఉన్న తమ కుమార్తెను చూసి వారు తల్లడిల్లిపోయారు. చివ రి మాటలకు కూడా నోచుకోలేదని విలపించారు. 21వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు మృతిచెందిందని తెల్లిదండ్రులు తెలిపారు. ఈవిషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేయ డంతో వారు కాలేజివద్దకు వెళ్లి విచారణచేయగా కాలేజి యాజమాన్యం ట్రీట్‌మెంట్ విషయంలో సరైన సమాధానం చెప్పలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆదివారం తెల్లవా రు జామున స్వగ్రామం కడప జిల్లా పోట్లదుర్తికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.