ధర్మవరం పట్టణం మెయిన్ బజార్లో ఉన్న జట్కా స్టాండ్ సమీపంలో పేరుకుపోయిన చెత్తను మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం తొలగించారు. గత కొన్ని సంవత్సరాలుగా పిచ్చి మొక్కలు చెత్తతో నిండిన జట్కా స్టాండ్ ను శుభ్రం చేయించాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లడంతో మంత్రి ఆదేశాల మేరకు జట్కా స్టాండ్ ప్రాంతమంతా శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ వేశారు.