శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టుకుంటుంది. ఇటు విద్యార్థుల ఫీజులతో పాటు పాఠ్యపుస్తకాలు యూనిఫాంల ధరలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో హిందూపురం పట్టణంలోని కృష్ణ గార్మెంట్స్ వస్త్ర దుకాణ వ్యాపారస్తుడు పాఠశాల యూనిఫాంలను విక్రయిస్తున్నాడు. అతని ఎంత చెబితే అంతేనని ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా విక్రయిస్తున్నాడు.