అనంతపురం జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాటికి 82, 125 మంది రైతులకు 73, 933 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరు వరకూ విత్తన పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 50% రాయితీతో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట, రాగులు, కొర్రలు, 30% రాయితీతో కందులు, మినుములు, పెసర విత్తన పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.