కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, ఆత్కూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. టమాటా లోడుతో వెళుతున్న లారీకి పంచర్ పడింది. దీంతో లారీ టైరు మార్చేందుకు హెల్ప్ చేద్దామని టాటా మ్యాజిక్ డైవర్ వచ్చాడు. ఈ క్రమంలో సిమెంట్ లారీ అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో సంఘటన స్థలంలోనే టమాటా లారీ డైవర్, టాటా మ్యాజిక్ డైవర్ ఇద్దరు మృతి చెందారు. విజయవాడ నుండి ఏలూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.