కర్నూలు జిల్లా, ఆలూరు సివిల్ సప్లై గోడౌన్ నుంచి హోలాగుంద మీదుగా కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పోలీసులు సివిల్ సప్లై గోడౌన్లో పని చేసే ఓ ఉద్యోగి రేషన్ దళారులతో కలిసి నకిలీ ఆర్వో బిల్లులతో 122 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ దందా వెనుక ఓ రెవెన్యూ అధికారి ఉన్నట్లు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై అధికారులు విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. తరచూ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. కొందరు అవినీతిపరులు అక్రమార్కులకు అండగా నిలవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొందరు అక్రమార్కులు వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రేషన్ బియ్యం పక్కదారిపడుతోంది.