కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ సోమవారం దర్శించుకున్నారు. ఆయన్ను ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం ఆయన్ను వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఆలయ సూపరింటెండెంట్ వాసు, ఇన్స్పెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.