గంజాయి, డ్రగ్స్ ముఠాలు, బ్లేడ్ బ్యాచ్‌ల నుంచి యువతను కాపాడుకోవాలి’ అని పవన్ పేర్కొన్నారు. ఇలాంటి ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. సభలో విషయాన్ని చెప్పేటప్పుడు భావ తీవ్రత ఉండొచ్చని, భాష సరళంగా, మర్యాదపూర్వకంగా ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు, ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు, చర్చల్లో పరుష పదజాలం వాడొద్దని, ప్రజలతో గౌరవంగా ఉంటూ వారి బాధలు, సమస్యలను జాగ్రత్తగా వినాలని’ ఆయన సూచించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు అభినందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి, గెలుపు కోసం సహకరించిన కూటమి నాయకులను అభినందించాలని ఆదేశించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పని చేసిన జనసైనికులు, వీర మహిళలు, సభల్లో వలంటీర్లుగా పనిచేసిన వారికోసం ప్రత్యేకంగా కృతజ్ఞత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ శ్రేణులను బలోపేతం చేసే బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని పేర్కొన్నారు. పార్టీ తరఫున చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతమైందని, నియోజకవర్గ స్థాయి లో కూడా ప్రతినెలా జనవాణి చేపట్టాలని పార్టీ ఎమ్మెల్యేలను పవన్ ఆదేశించారు. కాగా, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేలా పనిచేసి దేశం మెచ్చేలా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబుగులు అద్దుతామని పవన్‌కల్యాణ్ అన్నారు. మంగళవారం ఆయనను కలిసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడారు.