పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ప్లాన్ అప్రూవల్ కూడా తీసుకోకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనం పూర్తిగా అక్రమమని పూడా(పల్నాడు అర్బన్ డవల్‌పమెంట్ అథారిటీ) తేల్చేసింది. ఆ భవనానికి మంగళవారం పూడా ప్లానింగ్ అధికారులు నోటీసు అంటించారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే కూల్చేస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు. అలాగే, శ్రీకాకుళం, పార్వతీపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో కూడా వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అంటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa