కుప్పం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు అనేక హామీలిచ్చారు. ఏడాదిలోగా నియోజకవర్గానికి హంద్రీ-నీవా కుప్పం బ్రాంచి కెనాల్ ద్వారా నీళ్లు తెస్తానన్నారు. ‘మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతాను. నేను మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే.. 8 సార్లు కుప్పం నుంచే గెలిపించారు. వచ్చే ఐదేళ్లలో వారి రుణం తీర్చుకుంటా. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేముందు మీ ఆశీస్సుల కోసం వచ్చాను. కుప్పం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ, రింగు రోడ్డు, కార్గో విమానాశ్రయం, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తా’ అని తెలిపారు.