విద్యకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) సంస్థ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విద్యా జాగృతి ఉద్యమం జూలై 15 వరకు కొనసాగుతుందని సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఎండీ హలీమ్ తెలిపారు. రామకృష్ణారావుపేటలోని సంస్థ కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంలో మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిపి చదివించే జీవో నెంబరు 117ను రద్దు చేయాలని కోరారు. విద్యా జాగృతి ఉద్య మం పోస్టర్‌ను సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. సమా వేశంలో సంస్థ జిల్లా సభ్యులు కె.లలితాదేవి, సాహెర బేగం, అల్లా ఉద్దీన్, సిటీ అధ్యక్ష కార్యదర్శులు గౌస్ మొహిద్దీన్, ఎండీ అజహర్, ఉపాధ్యక్షుడు ఎండీ ఇబ్రహీం, సిటీ సభ్యు లు బషీరా సుల్తానా, సిరాజుద్దీన్, అఖేల్ ఆలీ పాల్గొన్నారు.