ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దని మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీచర్లపై అనవసర యాప్ల భారాన్ని తగ్గించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి నారా లోకేష్ సమీక్ష ఈరోజు(బుధవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక విషయాలపై చర్చించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో చర్చించారు. దాదాపు 3గంటలపాటు అధికారులతో మంత్రి లోకేష్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.