శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని డీసీహెచ్ ఎస్ మురళీకృష్ణ వైద్యాధికారులను ఆదేశించారు. డీసీహెచ్ ఎస్ మురళీకృష్ణ గురువారం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని శుక్రవారం సందర్శించారు. తూర్పు మండలాల్లో అతిసార వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ఏరియా ఆసుపత్రిలోని ఐడీహెచ్ వార్డును పరిశీలించి రోగులను ఆయన పరామర్శించడం జరిగింది.