సింగరాయకొండ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ బృందం ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ నాగేష్ కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొనాలని శుక్రవారం ఆమె విజ్ఞప్తి చేశారు.