కనిగిరి జననీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ పొందిన మహిళలకు గురువారం మాజీ కౌన్సిలర్ బొగ్గరపు శ్రీలత సద్గురు సహకారంతో కుట్టు మిషన్లను అర్హులైన వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి పాల్గొని కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఎదగాలన్నారు.