కొండాపురం మండలం గండికోట జలాశయంలో జులై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేటను నిషేధించినట్లు కడప ఉప మత్స్య సంచాలకులు కే. శాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చేపలు వృద్ధి చెందేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. కావున నిషేధిత కాలంలో మత్స్యకారులు చేపల వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుని, జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa