పుల్లంపేట మండలం కొత్తపేట గ్రామంలో గతంలో ఆగిపోయి మూసివేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని రైల్వేకోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి పునః ప్రారంభించారు. శుక్రవారం ఎన్టీఆర్ సుజల సురక్షిత త్రాగు నీటి కేంద్రాన్ని రిబ్బన్ కత్తిరించి పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.