సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. కాగా మొన్న ప్రియుడు..ఈరోజు ప్రియురాలు చనిపోయింది. గూడెం గ్రామానికి చెందిన చందు, భాగ్య లక్ష్మి కరీంనగర్ లోని ఓ పార్కులో ఈ నెల 24న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రియుడు అక్కడే చనిపోగా.. ప్రియురాలు ఎల్లారెడ్డిపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa