రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి వర్షప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గోదావరి, కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి, వరద ప్రవాహాన్ని గమనించి, తగిన చర్యలు తీసుకోవాలి’ అని అధికారులకు మంత్రి నిర్దేంచారు.