వ్యవసాయ విద్యుత మోటార్లకు కాంట్రాక్టర్ మీటర్లను బిగించారు. శుక్రవారం ఉదయం అనంతపురం , గార్లదిన్నె మండలంలోని తిమ్మంపేట, పాపనేపాళ్యం గ్రామాల్లో మీటర్లు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టర్ ఆదేశాల మేరకు ఆ కంపెనీ సిబ్బంది ప్రత్యేక వాహనంలో మీటర్లను తీసుకొని వెళ్లారు. ఆయా గ్రామాల రైతులు మీటర్లు ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని వ్యతిరేకించారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి వెనుతిరిగారు. తిరిగి సాయంత్రం సమయంలో గార్లదిన్నె మండల కేంద్రం సమీపంలోని పొలాల్లో రైతులులేని సమయంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి వెళ్లిపోయారు.