పాఠశాల విద్య ప్రైవేటుపరం కావడానికి ప్రభుత్వ నిర్ణయాలు దోహదపడుతున్నాయని, వీటిని నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం సరిచేయాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లా బాలకృష్ణ కోరారు. గుమ్మలక్ష్మీపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శుక్రవారం మాట్లాడారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయడం, ఈ డబ్బు విద్యా సంవత్సరం ప్రారంభంలో జమ చేయడం, వేలాది గ్రామాల్లో 3, 4, 5 తరగతులు అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ తల్లిదండ్రుల దృష్టి ప్రైవేటు పాఠశాలల వైపు మరలే విధంగా చేస్తున్నాయన్నారు. నిర్బంధంగా అమలు చేస్తున్న యాప్‌ల నిర్వహణ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన కంటే విద్యేతర కార్యక్రమాల అమలు ప్రధామని తల్లిదండ్రులు అంచనాకు వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు దుర్గారావు, మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్‌రావు, బంటు సింహాచలం పాల్గొన్నారు.