ఉప్పలపాడు నుండి ముటుకూరు వరకు ఉన్న 17. 6 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ. 4 కోట్లు నిధులు మంజూరైనట్లు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం తెలిపారు. రహదారి నిర్మాణానికి సంబంధించిన పనులను వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో సోమవారం ఉదయం 9 గంటలకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa