సంపద సృష్టిస్తాం, అప్పులు చేయమని అధికారంలోకి వచ్చిన కూటమి.. వారాల్లోనే రూ. 7000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు అప్పులు తెచ్చేందుకు ఏర్పాట్లు చేసిందని, సంపద సృష్టించడం అంటే ఇదేనా..? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి అన్నారు. ఏ సంక్షేమమూ అమలు చేయకుండానే వేల కోట్ల రూపాయల అప్పులకు ప్రయత్నాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. మరి ఐదేళ్లలో సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేస్తుందని ప్రశ్నించారు.