తిరుపతిలోని వకుళామాత ఆలయానికి కూడా వెళ్లడానికి వీలు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పర్యటిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని సాకు చెప్పారు. అంతటితో ఆగని పోలీసులు.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసేందుకు వచ్చిన నియోజకవర్గ ప్రజలను సైతం లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. వంద మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, పెద్దిరెడ్డి నివాసంలోకి ఎవరూ వెళ్లేందుకు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. ఇదే సమయంలో పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పలువురు వైయస్ఆర్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. తమ ఆదేశాలను పాటించకపోతే కేసులు పెడతామని బెదిరించారు.