అనంతపురం నగరంలో గనే నాయక్ భవన్ లో నీట్ పరీక్షను రద్దు చేయాలని ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని మంగళవారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పరమేష్, ఏఐఎస్ఎఫ్ కుళ్లాయి స్వామి, ఎన్ఎస్ యూ ఐ ఎనుమల నరేష్, పీడీ ఎస్ యూ వీరేంద్ర ప్రసాద్ లు మాట్లాడుతూ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని అన్నారు.