ధర్మవరం పట్టణంలోని 18వ వార్డు గాంధీనగర్లో దివ్యాంగులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. దివ్యాంగులకు గతంలో రూ. 3 వేలు వస్తుండగా సీఎం చంద్రబాబు నాయుడు రూ. 6 వేలకు పెంచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ఇన్చార్జ్ కత్తుల బాజ్జి తదితరులు పాల్గొన్నారు.