ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతీనెల సమీక్షించి ప్రాధాన్యతల వారీగా లక్ష్యాలు నిర్ణయిస్తామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రోడ్లపై గుంతలను తాత్కాలంగా పూడ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గుంటూరు ఛానల్ పొడిగింపునకు కూడా నిధులు బడ్జెట్ లో పెట్టాలని అడిగామన్నారు. ఛానల్ను పర్చూరు వరకు పొడగించాలంటే మొదటి నుంచి కాలువను వెడల్పు చేయాల్సి ఉందన్నారు. ఛానల్ పొడగింపునకు ఇప్పటికే ప్రతిపాదనలున్నాయని.. వాటి మేరకు బడ్జెట్లో నిధులు మంజూరుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు.