పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో భారీ దొంగతనం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్‌లో రూ. 11 లక్షల నగదు, 4 వందల గ్రాముల బంగారం బ్యాగ్ చోరీకి గురైంది. గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి నరసాపురం నుంచి నగదు బంగారం తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది. భీమవరం వెళ్లే బస్సు రద్దీగా ఉండడంతో తన బ్యాగ్‌ను బస్సు కిటికీలోంచి బస్సులో వేశాడు. అయితే బస్సు ఎక్కి చూసుకునేసరికి బ్యాగ్ కనిపించలేదు. దీంతో బాధితుడు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.