ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీలో కొందరు సచివాలయ ఉద్యోగులు చేతివాటం చూపించారు. రూ.200 సచివాలయ సిబ్బంది తీసుకుని మిగిలిన మొత్తాన్ని పెన్షనర్లకు అందచేశారు. అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలంలోని టి.కమ్మపల్లె పంచాయతీ కృష్ణంపల్లెలో సచివాలయ సిబ్బంది వలంటీర్‌తో కలిసి పెన్షన్లు పంపిణీ చేసి చేతివాటం ప్రదర్శించారు. ఈ గ్రామంలో సుమారు 40కి పైగా వివిధ రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. సచివాలయ సిబ్బంది, వెల్ఫేర్ అసిస్టెంట్ ఫణిక్రిష్ణ, డిజిటల్ అసిస్టెంట్ మహేశ్‌లు గతంలో పనిచేసిన వలంటీర్ సురేష్‌ను వెంటబెట్టుకుని పెన్షన్ పంపిణీ చేశారు.