చిత్తూరు జిల్లాలోని శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ సద్దాం ఉస్సేన్‌ను సస్పెండ్ అయ్యారు. జాయింట్ కలెక్టర్ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రైతు నుంచి భూ సర్వే కోసం లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారని ఫిర్యాదు రావడంతో విచారించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణంలో కూడా డిప్యూటీ సర్వేయర్ సద్దాం ఉస్సేన్ ఇబ్బందులు పెట్టారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో విచ్చలవిడిగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గంలో సమూలంగా ప్రక్షాళన చేయాలనీ అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీతో అంటకాగిన పోలీసులను అధికారులు వీఆర్‌కి పంపారు. ఈ ఘటనతో రెవెన్యూ అధికారుల్లోనూ గుబులు మొదలైంది.