ఇవాళ మూడు శాఖల పని తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్షించనున్నారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు, చేర్పులపై సమీక్ష నిర్వహించనున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహరాలపై చంద్రబాబు చర్చించనున్నారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని చర్చించనున్నారు. ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని గతంలో టీడీపీ ఆరోపణలు చేసింది. ముందుగా రోడ్ల మరమ్మత్తులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టనుంది. రేపుఅమరావతి మీద శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై వైట్ పేపర్ విడుదలకు మంత్రి నారాయణ తుది కసరత్తు నిర్వహిస్తున్నారు. రేపు శ్వేత పత్రం విడుదవ చేస్తున్నందున్న సీఎం చంద్రబాబుకు నారాయణ, అధికారులు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు.