వైసీపీ ప్రభుత్వం జగనన్న భూరక్ష పథకం కింద తీసుకొచ్చిన భూముల రీసర్వేతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే భూ రీసర్వేను రద్దు చేయాలని ప్రకాశం జిల్లా, పుల్లలచెరువు రైతులు డిమాండ్ చేశారు. సోమవారం పుల్లలచెరువు తహసీల్దార్ కార్యాలయంలో డీటీ కిరణ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... మండలంలోని చౌటపల్లిలోని 102 సర్వేనంబర్ల పట్టా భూములును ఇనాం భూములుగా మార్చారని అన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎల్‌పీ నెంబర్లతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీ సర్వే తరువాత భూముల కొలతలు మారి రైతుల భూములు తప్పుగా ఉన్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి రీసర్వేను రద్దు చేసి పాత విధానంలో భూముల ఆన్‌లైన్ చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.