ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. బుధవారం ఏపీ క్యాపిటల్ అమరావతి పై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన ఎట్టిపరిస్థితుల్లో హైదరాబాద్ కంటే మెరుగ్గా రాజధానిని నిర్మిస్తామని అధికారులతో స్పష్టం చేశారు.ఈ క్రమంలో ఢిల్లీకి చేరుకున్న ఆయన రాజధాని, పోలవరం డ్యాం, ఇతరు నిధులు, సమస్యలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ 16 స్థానాలతో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీగా భారీ ఎత్తున సపోర్ట్ దక్కుతుందని ఏపీ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
![]() |
![]() |