రాష్ట్రంలోనే చరిత్ర కలిగిన ఆదోని మార్కెట్ కమిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. బుధవారం మార్కెట్ యార్డు లోని కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో కమిషన్ ఏజెంట్స్, గుమాస్తాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సమస్య వచ్చినా నేరుగా తమ వద్దకు రావచ్చన్నారు. వ్యయప్రయాసాలకోరి పంటను విక్రయానికి తెచ్చిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కమిషన్ ఏజెంట్స్ తమ వద్దకు వచ్చే రైతులకు ఏరోజుకు, ఆరోజు చెల్లింపులు జరపాలన్నారు. వేరుశనగ వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే, కోల్డ్ స్టోరేజి నిర్మాణానికి రాయితీ వచ్చేలా చూస్తామని పేర్కొన్నారు. మార్కెట్ యార్డు కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, బత్తిన లక్ష్మీనారాయణ, టీడీపీ, జనసేన నాయకులు గుడిసె కృష్ణమ్మ, మల్లప్ప, శ్రీకాంత్ రెడ్డి, గుడిసె శ్రీరాములు, రాజాగౌడ్, బ్రహ్మయ్య పాల్గొన్నారు.
![]() |
![]() |