తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, సీఎంగా చంద్రబా బునాయుడు, ఎమ్మెల్యేగా తన గెలుపు కోసం క ష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ అన్ని వేళలా అండగా ఉంటానని, ఎవరూ నిరుత్సాహపడవద్దని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. బుధవా రం ఒంగోలు నగరంలోని ఆస్టోనా ఫంక్షన్ హాలులో టీడీపీ, జనసేన, బీజేపీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చా ర్జులతో దామచర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య కా ర్యకర్త నుంచి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి నాయకుల వరకు కష్టపడి పనిచేశారని చెప్పారు. ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్య ధిక మెజారిటీ వచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క రికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ప్రతి డివిజన్‌లో సమస్యలు గుర్తించాలని, ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణ పరిష్కారిస్తానని సూచించారు. అలాగే ఒంగోలు నగర అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దామని, ప్రజల నమ్మకాన్ని నిల బెట్టే బాధ్యత ఎమ్మెల్యేగా తనపై, అలాగే కూట మి శ్రేణులుగా మీ అందరిపై ఉందని దామచర్ల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కా మేపల్లి శ్రీనివాసరావు, మాజీ మునిసిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బం డారు మదన్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
![]() |