ఒడిశాలోని పూరి జగన్నాత్ రథయాత్ర సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వేశాఖ నిర్ణయించింది. ఎనిమిది ప్యాసింజర్ రైళ్లు నడపనుంది. పలాస-పూరీ స్పెషల్ (08331) హరిపూర్‌గ్రామ్ రైలు అర్గుల్ మీదుగా పలాస నుంచి ఈ నెల 7, 15, 17 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పలాసలో రాత్రి12.15 గంటలకు బయలుదేరి ఉదయం 5.35కు పూరీ చేరుకుంటుంది. పూరీ-పలాస స్పెషల్ ట్రైన్ (08332) ఈ నెల 8, 16, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. పూరీలో ఉదయం 4 గంటలకు బయలుదేరి అదేరోజు ఉదయం 10.05 గంటలకు పలాసకు చేరుకుంటుంది. విశాఖపట్నం-పూరీ స్పెషల్ (08347) హరిపూర్‌గ్రామ్, అర్గుల్ మీదుగా విశాఖపట్నం నుంచి ఈ నెల 6, 14, 16 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. వైజాగ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి.. అదేరోజు రాత్రి 10.45గంటలకు పూరీకి చేరుకుంటుంది. పూరీ-విశాఖపట్నం ప్రత్యేక రైలు (08348) ఈ నెల 8, 16, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్.. పూరీలో రాత్రి 1.45కు బయలుదేరి అదేరోజు ఉదయం 10.30కు విశాఖపట్నానికి చేరుకుంటుంది. కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, సిగడాం, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, పలాస, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, బ్రహ్మాపూర్, ఛత్రాపూర్, గంజాం, ఖల్లికోటే, బాలుగావ్, కలుపరఘాట్, నిరాకార్‌పూర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయని అధికారులు తెలిపారు.