ధర్మవరం పట్టణంలో అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పిఆర్టి వీధిలో భగత్ సింగ్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ దేశం నాకు ఏమిచ్చింది అనేది కాకుండా దేశానికి నేను ఏమి ఇచ్చాను అన్న విధంగా అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని అన్నారు.